Wednesday, January 22, 2025

సపాయి కార్మికులకు సలాం

- Advertisement -
- Advertisement -

వెల్గటూర్: తెలంగాణ లో పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామం లో గ్రామ సర్పంచ్ దుర్గం లక్ష్మి అద్యక్షతన జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ తో కలిసి మంత్రి కొప్పుల ముఖ్యాథితి గా పాల్గోన్నారు.

పల్లె ప్రగతి దినోత్సవం లో భాగంగా అంబారిపేట గ్రామంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎల్ రమణ తో కలిసి అంబే ద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ, నూతనం గా నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వ ర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి వేడుకలలో పల్లె ప్రగతి ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికి మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభా కాంక్షలు తెలిపారు.

అంబారిపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ,నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును ప్రా రం భించారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ లో పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నా రు. పల్లె ప్రగతి తో గ్రామాల రూపు రేఖలు మారాయని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం తో చెత్త సేకరణ తో గ్రామాలలో అద్దాలా మెరుస్తున్న రహాదారులు ,డ్రైనేజీ ల్లో మురుగు తీసి వేతలతో గ్రామాల్లో రోగాలు దూరమైనాయని తెలిపారు.

పల్లె జీవనంలో విత్నూ మార్పులు వచ్చాయన్నారు. మనకు ఎమివచ్చిందని కాదు. మన గ్రామానికి ,రాష్ట్రనికి, దేశానికి ఏమి వచ్చిందనేది ముఖ్యం అన్నా రు. తెలంగాణ రాకముందేట్లుండే, తెలంగాణ వచ్చాకా ఎట్లుందని గమనించాలి అన్నారు. 40 ఏండుల పాలించిన కాంగ్రెసు వల్ల ఏమి కాలే దు. గాంధీ జీ కలలు గన్న గ్రామ స్వారాజ్యాన్ని తీసుకువచ్చెందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధే దేశాల అభివృద్ధికి నిదర్శంగా నిలుస్తుందని భావించి పల్లె ప్రగతి కార్యక్ర మాన్ని ఊరూరా చేపట్టి గ్రామాల పరిశుభ్రత,స్వచ్చతే లక్షంగా దశల వారిగి పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది.

పల్లె ప్ర గతి లో భాగంగా గ్రామాల్లో పేరేకు పోయిన చెత్త చేదారం, మురుగు కాలువలను శుభ్రపరచడం , పరిసరాల పరిశుభ్రత ఎవెన్యూప్లాంటే షన్,నర్సరీ, డంపింగ్ యార్డలల్ల పిచ్చమొక్కల తొలగింపు, వైకుంఠదామాల నిర్మాణం,వెజ్, నాన్ వెజ్ మార్కేట్‌ల నిర్మాణాల తో పల్లెలు పరిశుభ్రతతో కనిపిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో రూ .18820 కోట్లు మంజూరి చేయి నూతనంగా 5441 గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించుకున్నామని ఆయన తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ కార్యదర్శిని నియమించిన మొదటి రా ష్ట్రం తెలంగాణ అన్నారు.

ప్రతి గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఏర్పాటు చేసిన రాష్ట్ర తెలంగాణ అని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ లో నర్సరీ, పల్లె పకృతి వనం ఎవెన్యూప్లాంటేషన్ ఏర్పాటు చేసిన తోలి రాష్ట్రం గా తెలంగాణ నిలుస్తుందని అన్నారు. దేశం లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ 14456 గ్రామాలల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు, ప్రతి ఇంటికి నల్లల ద్వారా శుద్ధి చేసిన మంచినీటి సరఫరా చేస్తున్న రాష్ట్రం దేశంలోనే ప్రథమ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు.

ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ తె లంగాణ రాష్ట్రం ఏర్పాటు లోముఖ్యపాత్ర పోసించిన కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి దేశంలో తెలంగాణ రాష్ట్రని మొదటి స్థానం లో నిలిపారని అన్నారు. ప్రతి ఇంటిలో కెసిఆర్ పథకాల ఫలీతాలు అందుతున్నాయని అన్నారు. అన్ని రంగాలలో ఘన నీయమైన ప్రగతి కనపడుతుందని తెలిపారు. ప్రపంచదేశాలు కోనియాడేల హైదరాబాద్ లో 125 డా. అంబేద్కర్ వి గ్రహా ఏర్పాటు చేసిన ఘనత కెసిఆర్ దని అన్నారు.

జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వా రా గ్రామాల్లో వైకుంఠదామం, డంపింగ్‌యార్డుల నిర్మాణం, గ్రామా పరిశుభ్రత, వ్యక్తిగత మరుగు దోడ్ల నిర్మాణాల తో గ్రామాల రూపురే ఖలు మారాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపిపి కునమల్ల లక్ష్మి లింగయ్య, జడ్పిటీసీ బి.సుధారాణి రామస్వామి,వెల్గటూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్, కోటిలింగాల ఆలయ కమిటీ చైర్మన్ పదిరె నారాయణరావు, పిఎసిఎస్ చైర్మన్ లు గోలి ర త్నాకర్, గుడా రాంరెడ్డి, మండల రైతు బంధు సమితి అద్యక్షులు చుక్క శంకర్ రావు, ఎండపల్లి, వెల్గటూర్ మండల బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు జగన్, చల్లూరి రాంచంద్రం గౌడ్, కార్యదర్శి జూపాక కుమార్ ,నాయకులు ఏలేటి కృష్ణా రెడ్డి, మూగల సత్యం, రాజేశ్వర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటీసీలు,గ్రామ ప్రజలు , ఎండపల్లి తహశీల్దారు ఉదయ్ కుమార్, వెల్గటూర్ ఎంపిడిఓ అకుల సంజీవ రావు, ఎంపిఓ జక్కుల శ్రీనివాస్,గ్రామ కార్యదర్శి, గ్రామ పారి శుద్ద సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News