Thursday, January 23, 2025

త్యాగ వీరులకు సెల్యూట్

- Advertisement -
- Advertisement -

దేశమాత స్వేచ్ఛ కోసం బలి దానం చేసిన వీరయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్. బ్రిటిష్ ప్రభుత్వం వీరికి ఉరిశిక్ష విధించినా భయపడకుండా నవ్వుతూ ఉరి కంబం ఎక్కి దేశం కోసం ప్రాణాలను అర్పించి చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహావీరులు. వీరి త్యాగం వృథా కాలేదు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టింది. యువకులకు స్ఫూర్తినిస్తూ దేశభక్తిని చాటి చెప్పిన అమర యోధుడు భగత్ సింగ్. తన ధైర్యంతో బ్రిటిష్ సామ్రాజ్యానికి ముచ్చెమటలు పట్టించిన మరో యోధుడు రాజ్‌గురు. తన చిరునవ్వుతో మరణాన్ని సైతం ఓడించి దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన మరో ఘనుడు సుఖదేవ్. మార్చి 23 1931న వీరు చేసిన త్యాగాలు భారత దేశ స్వాతంత్య్ర పోరాటానికి ఒక కొత్తమార్గం చూపింది. బ్రిటిష్ చీకటి సామ్రాజ్యం నుంచి భారత దేశానికి స్వేచ్ఛ స్వాతంత్య్రపు క్రాంతి విరజిమ్మిందంటే వీరి ప్రాణ త్యాగమే దానికి గల కారణం. భారత స్వాతంత్య్ర పోరాటంలో భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది.

ఈ ముగ్గురు యువకులు మన దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసి, భారతీయుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు.1928 డిసెంబర్ 17న లాహోర్‌లో సాండర్స్ హత్య కేసులో ఈ ముగ్గురిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 1929లో లాహోర్ కుట్ర కేసులో కూడా వారిపై ఆరోపణలు వచ్చాయి. 1930లో న్యాయస్థానం వారికి ఉరి శిక్ష విధించింది. ఉరి శిక్ష ఖరారు అయిన తర్వాత, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లు జైలులో చాలా ధైర్యం గా ప్రవర్తించారు. వారు చివరి క్షణం వరకు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భారత దేశం అంతటా ఈ ఉరి శిక్షపై భారీ నిరసనలు జరిగాయి. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ దేశభక్తులుగా, స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపు పొందారు. భగత్ సింగ్ రాజ్‌గురు, సుఖదేవ్‌ల ఉరిశిక్ష భారత స్వాతంత్య్రం పోరాటంపై లోతైన ప్రభావాన్ని చూపింది. భారతీయులలో బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత పెరిగింది.

వీరి ప్రాణ త్యాగం భారత స్వాతంత్య్ర పోరాటంలో మరువలేని ఘట్టం. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ దేవ్‌లు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. 1928లో భారతీయ విద్యార్థులపై జరిగిన అణచివేతలకు నిరసనగా భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లు బ్రిటిష్ పోలీస్ అధికారి సాండర్స్‌ను హత్య చేశారు. ఈ హత్య భారత స్వాతంత్య్ర పోరాటం పట్ల బ్రిటిష్ ప్రభుత్వంలో భయాందోళనలు రేకెత్తించింది. వీరికి ఉరిశిక్ష ఖరారు అయ్యే నాటికి భగత్ సింగ్‌కు 23, రాజ్‌గురు 22, సుఖదేవ్ 23 సంవత్సరాలు. ఉరిశిక్ష ఖరారు అయిన తర్వాత భగత్ సింగ్ ‘మేరా రంగ్ బసంతి చోలా’ అనే ప్రసిద్ధ కవితను రాయడం విశేషం. వారి ఉరి శిక్ష భారత దేశం అంతటా తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. వారి త్యాగం భారతీయులకు స్ఫూర్తిదాయకంగా మారి స్వాతంత్య్ర సాధన కోసం మరింత పోరాడేందుకు వారిని ప్రోత్సహించింది. ఈ ముగ్గురు యువకుల త్యాగం భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోబడుతుంది. ఉరిశిక్ష ఖరారు అయిన తర్వాత భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ లు తమ చివరి కోరికలను తెలియజేశారు.

భగత్ సింగ్ తన చివరి కోరికలో భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడే యువతకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. రాజ్ గురు తన చివరి కోరికలో భగవద్గీతను వినాలని కోరుకున్నాడు. సుఖదేవ్ తన చివరి కోరికలో తన తల్లిదండ్రులను చూడాలని కోరుకున్నాడు. ఈ ముగ్గురిని ఉరి తీసిన తర్వాత వారి మృతదేహాలను లాహోర్‌లోని షాహీ ఖిలాలో సమాధి చేశారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల ఉరి శిక్ష భారత స్వాతంత్య్ర పోరాటంలో ఒక విషాద ఘట్టం. ఈ ముగ్గురు యువకుల త్యాగం భారతీయుల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుంచుకోబడుతుంది. నేటి యువత వీరిని ఆదర్శంగా తీసుకొని దేశంలో జరుగుతున్న అక్రమాలు, స్త్రీల మీద జరుగుతున్న అరాచకాలపై పోరాటం చేయవలసిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. యువత సెల్ ఫోన్ నుంచి బయటకు వచ్చి సమాజాన్ని చూసి, సమాజం పట్ల అవగాహన కలిగించుకొని బాధ్యతతో దేశ భవిష్యత్తుకి తోడ్పడాలని కోరుకుంటూ.. భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లు చేసిన త్యాగాలకు సెల్యూట్ చేస్తూ జైహింద్!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News