Wednesday, January 22, 2025

ఈడీ అసాధారణ అధికారాలు అదుపు చేయకపోతే ఎవరికీ భద్రత ఉండదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసుల్లో దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులకు అసాధారణ అధికారాలు కట్టబెట్టారని సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే అన్నారు. వాటిని అదుపు చేయలేకపోతే దేశంలో ఎవరికీ భద్రత ఉండదని వాదించారు. గురుగ్రామ్‌కు చెందిన ఎం3ఎం కంపెనీ మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా కంపెనీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది సాల్వే , ఈడీ అధికారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ కేసులో విచారణకు సహకరించినా అధికారులు అరెస్టు చేశారు. ఇది పూర్తిగా హక్కుల ఉల్లంఘనే. ముందస్తు బెయిల్ షరతులను ఉల్లంఘించినట్టు ఎక్కడా ఆధారాల్లేవ్. అయినా ఈడీ ఇలా దారుణంగా వ్యవహరించి అరెస్టుకు పాల్పడింది”అని సాల్వే కోర్టుకు విన్నవించారు. ఓ అవినీతికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎం3ఎం డైరెక్టర్లు బసంత్ బన్సార్, పంకజ్ బన్సాల్‌పై ఈడీ అధికారుల కేసు నమోదు చేశారు.

జూన్ 1న ఈడీ అధికారులు ఎం3ఎం గ్రూప్ బన్సాల్ సోదరుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. దీంతో బన్సాల్ సోదరులు జూన్ 9న పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించగా, జులై 5 వరకు వారికి అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించింది. అయితే అయితే జూన్ 14న వారిని ఈడీ అరెస్టు చేసి పంచకుల లోని పిఎఎల్‌ఎ కోర్టులో హాజరు పరిచింది. దీంతో న్యాయస్థానం వారికి ఐదు రోజుల కస్టడీ విధించింది.

ఈ కస్టడీని సవాల్ చేస్తూ వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఇందులో జోక్యం చేసుకోడానికి న్యాయస్థానం నిరాకరించింది. దీంతో బన్సాల్ సోదరులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. బన్సాల్ సోదరుల తరఫున హరీశ్‌సాల్వే వాదనలు విన్న ధర్మాసనం బన్సాల్ సోదరులు ముందస్తు బెయిలు కోసం పంజాబ్ హర్యానా హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతులు ఇచ్చింది. అనంతరం వీరి పిటిషన్లను కోర్టు కొట్టేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News