Monday, January 20, 2025

ఆర్‌సిబి బౌలింగ్ కోచ్‌గా సాల్వీ

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్ ట్రోఫీ కోసం 17 సీజన్ల నిరీక్షణకు తెరదించాలని భావిస్తున్నట్టుంది బెంగళూరు యాజమాన్యం. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే పట్టుదలతో జట్టులో మార్పులు చేర్పులు చేపడుతోంది. అందులో భాగంగా జట్టుకు కొత్తగా బౌలింగ్ కోచ్‌ను నియమించుకుంది. ముంబై ప్రధాన కోచ్‌గా ఉన్న ఓంకార్ సాల్వీని బౌలింగ్ కోచ్‌గా నియమిస్తూ సోమవారం అధికారిగా ప్రకటన చేసింది ఆర్‌సిబి యాజమాన్యం. 17వ సీజన్‌లో సాల్వీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు. దాంతో, అతడిని తమ బౌలింగ్ యూనిట్ బలంగా మార్చుకోవాలని భావించిన ఆర్‌సిబి 18వ సీజన్ కోసం కోచ్‌గా బాధ్యతలు కట్టబెట్టింది. కాగా, బ్యాటింగ్ కోచ్‌గా దినేశ్ కార్తీక్ కొనసాగుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News