బుమ్రాతో గొడవపై కోన్‌స్టాస్
మెల్‌బోర్న్: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో గొడవలో నాదే పొరపాటని ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ అన్నాడు. అది అనుకోకుండా జరిగిపోయిందని, బుమ్రా అసాధారణ బౌలర్ అని కొనియాడాడు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌తో కొన్‌స్టాస్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే బుమ్రాపై భారీ సిక్స్‌లతో ఎదురుదాడికి దిగాడు. కొన్‌స్టాస్ ధాటికి బుమ్రా మూడేళ్ల తర్వాత టెస్ట్‌ల్లో సిక్సర్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో కొన్‌స్టాస్‌తో కోహ్లీ గొడవకు దిగాడు. అతన్ని భుజంతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో కోహ్లీపై ఐసిసి కఠిన చర్యలు తీసుకుంది. అనంతరం సిడ్నీ టెస్ట్‌లో కొనస్టాస్ బుమ్రాతో గొడవకు దిగాడు. సమయాన్ని వృథా చేయాలనే ఉద్దేశంతో బుమ్రాతో వాగ్వాదానికి దిగాడు.
కొన్‌స్టాస్‌పై కోపంతో బుమ్రా ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేశాడు. ఆ తర్వాత కొన్‌స్టాస్ వైపు చూస్తూ బుమ్రాతో పాటు భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో కొన్‌స్టాస్‌ఈ ఘటనపై స్పందించాడు. ఈ గొడవలో తనేద తప్పని అంగీకరించాడు. ‘దురదృష్టవశాత్తు, ఉస్మాన్ ఖవాజా ఔట్ అయ్యాడు. అతను ఇంకాసేపు ఆడేందుకు ప్రయత్నించాడు. బహుశా ఇది నా తప్పే. అయితే క్రికెట్ అన్నాక ఇలాంటివి జరుగుతాంటాయి.‘ అని పేర్కొన్నాడు. వాస్తవానికి నేను చాలా కామ్. నా అరంగేట్రం మంచిగా జరిగింది. రెండు విజయాలు సాధించడం పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.‘ అని చెప్పుకొచ్చాడు.