Monday, January 20, 2025

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రికార్డు.. ఒక్కడే 410 పరుగులు

- Advertisement -
- Advertisement -

లండన్: జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు నమోదైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వంద కాదు రెండు వందలు కాదు.. ఏకంగా ఓ క్రికెటర్ 400 పరుగులు బాదాడు. ఏంటి షాక్ అయ్యారా? అవును.. నిజం.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరుదైన రికార్డ్ ఇది. ఇంగ్లండ్‌లోని గ్లామోర్గాన్ జట్టు ఆటగాడు సామ్ నార్త్ ఈస్ట్ లీస్టర్ షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 450 బంతుల్లో 410 పరుగులు చేశాడు. 400లకుపైగా పరుగులు బాదడమే కాదు నాటౌట్‌గా నిలిచి వారెవ్వా అనిపించాడు. అతడి స్కోర్‌లో 45 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక స్కోర్ చేసిన రెండో ఆటగాడిగా సామ్ నిలిచాడు. తొలి స్థానంలో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఉన్నాడు. 1994లో వార్విక్ షైర్ తరఫున లారా 501 రన్స్ చేశాడు.

Sam Northeast hits 410 runs in First Class Cricket

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News