మెడికల్ అడ్మిషన్ల విషయంలో తీసుకువచ్చిన జీఓ 33పై హరీశ్ రావు అబద్దాలు చెబుతున్నారని పిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామ రాంమ్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ బిడ్డలకు మేలు జరగాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందన్నారు. ఈ జీఓ వల్ల 299 ఎంబిబిఎస్ సీట్లు తెలంగాణ బిడ్డలకు అదనంగా వస్తున్నాయని ఈ విషయంలో హర్షించాల్సింది పోయి ఏదో జరిగిపోతుందని అబద్దాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.
6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్న నిబంధనను తొలగించి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇక్కడ చదివిన వారిని స్థానికులుగా గుర్తిస్తున్నారని దీని వల్ల రాష్ట్ర విద్యార్థులకు మోసం జరుగుతుందనడం అవాస్తవమన్నారు. అలాగే విద్యార్థులు తెలంగాణకు చెందిన వారే అయితే స్థానికత రుజువు చేసుకునేలా రెసిడెన్షియల్ ఫ్రూఫ్స్ చూపినా సరిపోతుందన్న ఆప్షన్ కూడా ఇదే జీఓలో ఉందని కానీ, ఈ విషయం హరీశ్ రావు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.