Wednesday, January 22, 2025

సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి: నిరుద్యోగ జెఎసి డిమాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిరుద్యోగ జెఎసి డిమాండ్ చేసింది. మినిమం టైం స్కేల్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జెఎసి ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయాన్ని సమగ్ర శిక్ష ఉద్యోగులు ముట్టడించారు. ఈ ముట్టడికి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసి చైర్మన్ నీల వెంకటేష్, సమగ్ర శికా కాంట్రాక్టు ఉద్యోగుల అధ్యక్షురాలు స్వరూప రాణి, జాతీయ బిసి సంక్షేమ సంఘ జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ నేతృత్వం వహించారు. ముఖ్య అతిధిగా జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్య సభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పాల్గొని సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో సమగ్ర శిక్షా ప్రాజెక్టు లో జిల్లా, మండల, స్కూల్ కాంప్లెక్స్, పాఠశాల స్థాయిలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, ఐఈఆర్‌సిలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్స్, మేసేంజర్లు,

పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్లు, కేజీబీవి, యుఆర్‌ఎస్ స్పెషల్ ఆఫీసర్లు, సిఆర్‌టిలు, పిఈటీ, ఎఎన్‌ఎం, ఆకౌంటెంట్, కంప్యూటర్ టీచర్లు, ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్స్, వంటమనుషులు, వాచ్‌మెన్‌లు, అటెండర్లు, డిపిఓ స్థాయిలో ఎపిఓ, సిస్టమ్ ఎనలిస్ట్, డిఎల్‌ఎమ్‌ఎ, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నికల్ పర్సన్, ఆఫీస్ సబార్డినేటర్స్ గా వివిధ స్థాయిలో పనిచేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సుప్రీ కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ( మినిమమ్) టైమ్ స్కేల్‌ను అమలుచేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో, విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సమగ్ర శిక్షా, కెజిబివి, యుఆర్‌ఎస్ కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేలును అమలు చేసి ఉద్యోగాల క్రమబద్ధీకరణ చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. సమగ్ర ఇజిబివి యుఆర్‌ఎస్ ను విద్యాశాఖలో విలీనం చేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని,

సుప్రీకోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులందరికి మినిమమ్ టైమ్ స్కేల్‌ను (కనీస వేతనం) అమలు చేయాలని, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని, గ్రూప్ ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించాలని, నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలని విద్యాశాఖలో చేపట్టే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వెయిటెడ్ కల్పించాలని, మరణించిన, గాయపడిన కాంట్రాక్టు ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియో చెల్లింలని భవిష్యనిధి (పిఎఫ్ ) సౌకర్యం కల్పించాలని నిరుద్యోగ జెఎసి డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News