Monday, December 23, 2024

‘సామజవరగమన’ వచ్చేది అప్పుడే…

- Advertisement -
- Advertisement -

హీరో శ్రీవిష్ణు ‘సామజవరగమన’తో హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి సిద్ధంగా ఉన్నా రు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో హాస్య మూవీ స్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ కథానాయిక గా నటిస్తోంది. సోమవారం మేకర్స్ ఆకట్టుకునే పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీతో ముందు కు వచ్చారు. ఈనెల 29 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సామజవరగమన చిత్రం నవ్వులు పూయించనుంది. శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, వెన్నెల కిషోర్, నెల్లూరు సుదర్శన్ కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అలరించింది. గోపీ సుంద ర్ సంగీతం అందించిన ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ లవర్స్‌ని ఆకట్టుకుంది. ఈ చిత్రానికి భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు.

Also Read: మరో ఐదేళ్లు కష్టపడితే అన్నింటా మనమే టాప్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News