Monday, December 23, 2024

ఫ్యామిలీకి నచ్చే పాత్రలో కనిపిస్తా

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో శ్రీవిష్ణు… రామ్ అబ్బరాజు దర్శకత్వంలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’సామజవరగమన’తో రాబోతున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. గురువారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో హీరో శ్రీవిష్ణు మీడియాతో మాట్లాడుతూ “ఇది అవుట్ అండ్ అవుట్ క్లీన్ ఎంటర్‌టైనర్.

కడుపుబ్బా నవ్విస్తుంది. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ రాని పాయింట్‌ను ఈ సినిమాలో చెబుతున్నాం. చాలా డిఫరెంట్ గా వుంటుంది. ఇంతకుముందు నరేష్‌తో అర్జున ఫల్గుణ చిత్రంలో కూడా చేశాను.’సామజవరగమన’లో నరేష్ పాత్రకి యూత్ పిచ్చెక్కిపోతారు. తండ్రి, కొడుకుల అనుబంధం చాలా లైవ్లీగా హిలేరియస్ గా వుంటుంది. ఇందులో ఫ్యామిలీకి నచ్చే పాత్రలో కనిపిస్తా. హీరోయిన్ రెబా మోనికా జాన్ చాలా చక్కగా నటించింది”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News