Monday, December 23, 2024

‘సామజవరగమన’ నవ్వుల క్లాసిక్

- Advertisement -
- Advertisement -

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌ పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఫన్ టాస్టిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.

సక్సెస్ మీట్ లో డైరెక్టర్ మెహర్ రమేష్ మాట్లాడుతూ.. అనిల్ సుంకర గారు పాజిటివిటీ కి ప్యాషన్ కి మారుపేరు. ఆయనకు హిట్ రావాలని ఇండస్ట్రీ అంతా కోరుకున్నమాట నిజం. శ్రీవిష్ణు లో ప్యాషన్ చూస్తుంటే రవితేజ గుర్తుకు వస్తున్నారు. శ్రీవిష్ణు కు మరిన్ని విజయాలు రావాలి. ఈ సినిమా ట్రైలర్ ని అన్నయ్య చిరంజీవి గారు లాంచ్ చేశారు. భోళా శంకర్ షూట్లో  బిజీగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా సమయం తీసుకొని మంచి మనసుతో అన్నయ్య ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. దర్శకుడు రామ్ కు అభినందనలు.

భాను నందు ఇలా టీం అంతా కలసి మ్యాజిక్ క్రియేట్ చేశారు. ప్రేక్షకులు సినిమాని ఇంతలా ఆదరిస్తున్నారంటే దీనికి కారణం టీం సమిష్టి కృషి. నరేష్ గారు జంధ్యాల, ఈవీవీ గారి సినిమాలతో అందరినీ అలరించారు. ఇప్పుడు  ‘సామజవరగమన’ చిత్రాన్ని జంద్యాల, ఈవీవీ సినిమాలతో పోలుస్తూ మాట్లాడటం, ఇందులో నరేష్ గారు ఉండటం ఆనందంగా వుంది. రాజేష్ గారు మంచి స్పీడ్ వున్న నిర్మాత. స్పీడ్ గా మరిన్ని సినిమాలు తీయాలి. ఇది తెలుగు చిత్ర పరిశ్రమ విజయం. అనిల్ గారు జులై నుంచి ఇండస్ట్రీని సక్సెస్ నోట్ లోకి తీసుకెళ్ళారు. మెగాస్టార్ భోళా శంకర్ తో సక్సెస్ ని ఖచ్చితంగా కొనసాగిస్తాం’’ అన్నారు

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. సామజవరగమన లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది. అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. యూఎస్ లో కూడా దుమ్మురేపుతుంది. దర్శకుడు కథ చెప్పినపుడే ‘నువ్వు నాకు నచ్చావ్’ లాంటి సినిమా అవుతుందని నమ్మాను. నా నమ్మకం నిజమైయింది. సినిమా చూసి అందరూ హాయిగా నవ్వుతున్నారు. నిర్మాత అనిల్ గారిని చూడగానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇందులో నరేష్ గారి పాత్రని ఆయన తప్పితే మరొకరు చేయలేరు. ఒకవేళ నేను భవిష్యత్ లో సెకండ్ ఇన్నింగ్ మొదలుపెడితే.. నరేష్ గారి పాత్రని చేస్తాను.

(నవ్వుతూ) ఒక ఫ్యామిలీ లానే ఈ సినిమా చేశాం. ప్రతి నటుడి దగ్గర చాలా నేర్చుకున్నాను. హీరోయిన్ రెబ్బా చాలా మంచి నటి. తనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. నిర్మాత రాజేష్ గారు చాలా పాజిటివ్ గా వుంటారు. నాకు చాలా నచ్చారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడానికి వెళ్ళినపుడు చిరంజీవి గారి చేయి నా గుండె మీద ఎప్పుడైతే ఆటోగ్రాఫ్ గా పడిందో అప్పటి నుంచి ఈ సినిమా జాతకం మారిపోయింది. ఈ వేడుకకి   వచ్చిన దర్శకులు మెహర్ రమేష్ గారికి, వశిష్ట, విజయ్ కనకమేడల, హసిత్ అందరికీ థాంక్స్. మాకు ఎంతో సహకరించిన  మీడియాకి కృతజ్ఞతలు. మా పీఆర్వో వంశీ శేఖర్ కి కృతజ్ఞతలు. ఈ సినిమా ఇంకా చాలా రోజులు థియేటర్ లో ఆడుతుంది. ఈ సినిమా నవ్వుల క్లాసిక్ గా నిలిచిపోతుంది. ఇలాంటి గొప్ప విజయం ఇచ్చిన ప్రేక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు” తెలిపారు

నరేష్ మాట్లాడుతూ .. ఒక యూనిట్ సక్సెస్ కొట్టినప్పుడు ఇండియా సైన్యం పాకిస్తాన్ బోర్డర్ లో సర్జికల్ స్ట్రయిక్ కొట్టవచ్చినట్లు వుంటుంది..  ఆ ఫీలింగ్ ఇవ్వాళ చూశాను. అనిల్ గారు మనసున్న మనిషి. దమ్మున్న నిర్మాత.  రాజేష్ గారికి థాంక్స్. డైరెక్టర్ రామ్ అబ్బరాజు కి థాంక్స్ చెప్పాలి. జంబలకడిపంబ నాకు ఎంత పేరు తీసుకొచ్చిందో మళ్ళీ అంత పేరు తీసుకొచ్చిన క్యారెక్టర్ ఇచ్చారు. భాను, నందు చాలా చక్కగా రాశారు. విష్ణు నా బ్రదర్. తనకు కథల ఎంపికపై మంచి పట్టుంది. అద్భుతమైన నటుడు. తనకి మరిన్ని విజయాలు రావాలి. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మంచి కంటెంట్ ఇస్తే ఫ్యామిలీ అంతా థియేటర్ కి వస్తారని చెప్పడానికి కొలబద్ద ఈ చిత్రం’’ తెలిపారు.

అనిల్ సుంకర మాట్లాడుతూ..  ఇండస్ట్రీలో అందరూ మనస్పూర్తిగా కోరుకుంటే ఏం జరుగుతుందో  ఇవాళ నా విషయంలో అది జరిగింది. రెండు నెలల క్రితం ఒక అపజయం వచ్చింది. అప్పుడు పరిశ్రమలో అందరూ మేమున్నాం .. మీకు తప్పకుండా విజయం వస్తుందని అన్నారు. వారి ఆశీస్సులతో ఈ రోజు సామజవరగమన లాంటి పెద్ద విజయం వచ్చింది. ఈ సందర్భంగా అందరికీ  కృతజ్ఞతలు. శ్రీవిష్ణు విలక్షణమైన నటుడు. తన సినిమాలన్నీ చూస్తాను. నాకు ఇంత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన విష్ణు కి కృతజ్ఞతలు. భవిష్యత్ లో తను వద్దన్నా తనతో సినిమా చేస్తాను(నవ్వుతూ). నవ్వించడం అంత తేలిక కాదు. వెంకటేష్ గారు సీనియర్ మోస్ట్.

ఆ ప్లేస్ లో శ్రీవిష్ణు యాప్ట్. విష్ణు ఆ దిశగా పని చేయాలి.  ఈ కథ చెప్పినప్పుడే చాలా నచ్చింది. దర్శకుడు రామ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా ఎఫర్ట్ పెట్టాడు. తను చెప్పింది చెప్పినట్లుగా తీశాడు. తన కోసం ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నాను. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. భాను, నందు చక్కగా రాశారు. సినిమా చూసిన ప్రేక్షకులు పడిపడి నవ్వుతున్నారు. హీరోయిన్ రెబా జాన్ చక్కగా నటించింది. నరేష్ గారు లేకపోతే ఈ సినిమా ఉండేదో లేదో చెప్పలేను. ఆయన  పాత్రలో మరొకరిని ఊహించలేను. చిరంజీవి గారు ట్రైలర్ లాంచ్ చేయడంతోనే పాజిటివిటీ స్టార్ట్ అయిపొయింది. ఆయనకి కృతజ్ఞతలు. కావాల్సిన సమయంలో విజయం ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇది నిజమైన సక్సెస్ మీట్. అందరికీ సక్సెస్ రావాలి. ఇండస్ట్రీ కళకళలాడుతూ వుండాలి’’ అన్నారు

రాజేష్ దండా మాట్లాడుతూ.. అనిల్ గారు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విని చేసేద్దామని అన్నారు.  ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి అనిల్ గారితో కలసి పని చేసే అవకాశం వచ్చింది. ఇది జీవితంలో మర్చిపోలేను. నిర్మాతగా ఇది నా రెండో సినిమా. ఐదు రోజులుగా నిద్రపట్టడం లేదు. అంత హ్యాపీగా వుంది. అనిల్ గారు లేకపోతే హాస్య  మూవీస్ లేదు. మా దర్శకుడు రామ్ .. ప్రొడ్యూసర్ డైరెక్టర్. చాలా నిజాయితీగా  పని చేశారు. విష్ణు గారు ఈ కథ విన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ చేశారు. చాలా ఇన్ పుట్స్ ఇచ్చారు. ఆయనతో మళ్ళీ వర్క్ చేయాలని వుంది. ఈ సినిమా మరో పిల్లర్ నరేష్ గారు. కులశేఖర్ గా వెన్నెల కిషోర్ కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చూడని ప్రేక్షకులు సినిమాని చూసి ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అందించాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు రామ్ అబ్బరాజు మాట్లాడుతూ.. ఈ కథ బాను,నందు మా కాంబినేషన్ లో రెడీ అయ్యింది. కథ అనుకున్నప్పుడే యునిక్ పాయింట్ వుంది మంచి హీరో దొరికితే బావుండని అనుకున్నప్పుడు అనిల్ గారు పరిచయమయ్యారు. ఆయనకి కథ చెప్పిన వెంటనే ఓకే చేశారు. చాలా సపోర్ట్ చేశారు. అలాగే రాజేష్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ట్రైలర్ లాంచ్ చేయడంతో పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆయనతో ఆటో గ్రాఫ్ కూడా దొరికింది. ప్రేక్షకులకు, మీడియాకు కృతజ్ఞతలు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నరేష్ గారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయనతో కలసి పని చేయడం ఆనందంగా వుంది. రెబ్బా మోనికా జాన్ చక్కగా నటించింది. ఒక మనిషి సినిమా కోసం ఇంత కష్టపడతాడా ? అనేది విష్ణు గారిని చూసినప్పుడు తెలిసింది. ఆయన ఎన్నో ఇన్ పుట్స్ ఇచ్చారు. మమ్మల్ని నమ్మి ఇంతలా సహకరించిన శ్రీవిష్ణు గారికి కృతజ్ఞతలు. వచ్చిన అతిధులందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.

రెబా మోనికా జాన్ మాట్లాడుతూ.. అనిల్ గారు, రాజేష్ గారు ఈ సినిమాకి బ్యాక్ బోన్. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. దర్శకుడు తను చెప్పింది చెప్పినట్లు తీశారు. శ్రీ విష్ణు గారి సినిమాతో పరిచయం కావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. నరేష్ గారికి కృతజ్ఞతలు. టీం అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ తెలిపారు.

విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. అనిల్ గారికి ,రాజేష్ గారికి అభినందనలు. సినిమా విడుదలకు ఐదు రోజుల ముందే ప్రిమియర్స్ వేయడం నిర్మాతల నమ్మకాన్ని అద్దం పట్టింది. అనిల్ గారు మొదటి నుంచి సినిమాలని భిన్నంగా ప్రమోట్ చేస్తుంటారు. ఈ ప్రీమియర్స్ తో మరో కొత్తదారి చూపారు. కామెడీ తీయడం కష్టం. రామ్ అద్భుతంగా తీశాడు. భాను ,నందు కి అభినందనలు. ఇందులో శ్రీ విష్ణు గారిని చూస్తుంటే వెంకటేష్ గారిని చూస్తున్నట్లు అనిపించింది. వెంకటేష్ గారిలా మున్ముందు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చేయాలని కోరుకుంటున్నాను. మరోసారి టీం అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు

వశిష్ట మాట్లాడుతూ..టీం అందరికీ అభినందనలు. అనిల్ గారికి కంగ్రాట్స్. శ్రీవిష్ణు గారి టైమింగ్ సూపర్ . రాజా సక్సెస్ కోసం దండయాత్ర చేశారు.సాధించారు. ఇది చాలా ఆర్గానిక్ కామెడీ వున్న సినిమా. అందరూ హాయిగా నవ్వుకుని ఎంజాయ్ చేసే సినిమా ఇది’’ అన్నారు . ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News