Monday, December 23, 2024

‘సామజవరగమన’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

శ్రీవిష్ణు కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న పూర్తి ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’. మే 18న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సరదాగా సాగే ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ గురువారం విడుదల చేశారు.

Also Read: లిప్‌లాక్…. న్యూడ్‌గా నటించడానికి సిద్ధం: అమలాపాల్

ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ “ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకూ నవ్వుకుంటూనే వుంటారు. సినిమా హిలేరియస్‌గా వుంటుంది. గోపి సుందర్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. రెబా మోనికా జాన్ చాలా బాగా నటించింది”అని అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ “సామజవరగమన… కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన పక్కా ఎంటర్‌టైనర్. రామ్ చాలా క్రమశిక్షణతో ఈ సినిమా చేశాడు. సామజవరగమన చిత్రాన్ని అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు”అని తెలిపారు.

దర్శకుడు రామ్ అబ్బరాజు మాట్లాడుతూ “ఇది చిన్న టీజర్. ట్రైలర్, సినిమా ఇంకా ఫన్‌గా వుంటుంది. ఫ్యామిలీ అంతా కలసి సరదాగా ఎంజాయ్ చేసే సినిమా సామజవరగమన”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజేష్ దందా, రెబా మోనికా జాన్, గోపిసుందర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News