Wednesday, January 22, 2025

సమాజ్ వాదీ నేత ఆజాం ఖాన్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

రాంపూర్ (యూపీ) : 2019 నాటి నకిలీ జనన ధ్రువీకరణ పత్రాల కేసులో సమాజ్ వాదీ సీనియర్ నేత ఆజంఖాన్ తోపాటు భార్య తజీన్ ఫాతిమా, తనయుడు అబ్దుల్లా ఆజంకు యూపీ లోని రాంపూర్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఎంపీఎమ్‌ఎల్‌ఏ కోర్టు న్యాయమూర్తి షోబిత్ బన్సల్ ముగ్గురు దోషులకు ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. నకిలీ ధ్రువ పత్రాలపై బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ ఆకాష్ సక్సేనా రాంపూర్‌లోని గంజ్ పోలీస్ స్టేషన్‌లో 2019 జనవరి 3న ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

వారి కుమారుడు అబ్ధుల్లా ఆజాంకు రెండు నకిలీ పుట్టిన తేదీ సర్టిఫికెట్లు పొందేందుకు ఆజాం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా సహాయం చేశారని సక్సేనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక సర్టిఫికెట్ లక్నో నుంచి మరొకటి రాంపూర్ నుంచి పొందినట్టు ఫిర్యాదులో స్పష్టం చేశారు. రాంపూర్ మున్సిపాలిటీ నుంచి పొందిన సర్టిఫికెట్‌లో పుట్టిన తేదీ 1993 జనవరి1 ఉండగా, లక్నో మున్సిపాలిటీ నుంచి జారీ అయిన సర్టిఫికెట్‌లో లక్నోలో 1990 సెప్టెంబర్ 30 అని ఉంది. అబ్దుల్లా ఆజం విదేశీ పర్యటన కోసం పాస్‌పోర్ట్ పొందడానికి ఒక బర్త్ సర్టిఫికెట్ వినియోగిస్తున్నాడని రెండో సర్టిఫికెట్‌ను ప్రభుత్వ సంబంధిత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్టు తేలింది.

2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పి టికెట్‌పై గెలుపొందిన అబ్దుల్లా ఆజం అంతకు ముందే 2008 లో ప్రభుత్వ ఉద్యోగిని దాడి చేసిన కేసులో దోషిగా మొరాదాబాద్ కోర్టు నిర్ధారించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండేళ్ల జైలు శిక్ష పడడంతో అసెంబ్లీ సభ్యత్వాన్ని ఆజం కోల్పోయారు. రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని హైకోర్టును ఆశ్రయించగా కోర్టు తిరస్కరించింది. అలాగే స్టే విధించేందుకు సుప్రీం కోర్టు కూడా గతవారం నిరాకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News