Sunday, January 19, 2025

యూపీలో 65 లోక్‌సభ స్థానాలకు ఎస్‌పీ పోటీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని 80 లోక్‌సభ స్థానాల్లో 65 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు గురువారం వెల్లడించాయి. అభ్యర్థల పేర్లు దాదాపు ఖరారయ్యాయని పార్టీ స్పష్టం చేసింది. మిగతా 15 స్థానాలు ఇండియా కూటమిలోని కాంగ్రెస్, తదితర పార్టీలకు విడిచిపెడుతున్నట్టు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీకి కాంగ్రెస్ సీట్లు కేటాయించకపోవడంతో ,

ఎస్పీ అధినేత ఆ పార్టీపై కారాలు మిరియాలు నూరుతున్నారు.మద్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లకు ఎస్పీ 6 సీట్లు కోరుతున్నా, కాంగ్రెస్ ఎప్పీకి సీట్లు కేటాయింపునకు సుముఖంగా ఉండడం లేదు. దీంతో అఖిలేశ్ బహిరంగం గానే కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. యూపీ సీట్ల విషయంలో ఎస్పీకి, ఇండియా కూటమికి మధ్య విభేదాలు కనిపించినా, కాంగ్రెస్‌పై మరీ గుర్రుగా ఉన్నా కాంగ్రెస్ కంచుకోటలైన అమేథీ, రాయ్‌బరేలీలో అభ్యర్థులను నిలబెట్టకూడదని ఎస్పీ నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News