Monday, January 20, 2025

బాలీవుడ్ మూవీ జులైలో సెట్స్‌పైకి…

- Advertisement -
- Advertisement -

 

Samantha act in Bollywood movie

స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో ఇప్పటికే ఉత్తరాది ప్రేక్షకులకు చేరువైన సమంత ఇప్పుడు ఒక సినిమాతో హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మేకర్స్ రాజ్ అండ్ డీకే చిత్రంలో సమంత నటించబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

సమంత మొదటి హిందీ సినిమాకు సంబంధించిన విషయాలు మెల్ల మెల్లగా బయటకు వస్తున్నాయి. ఇటీవలే ఆమె వరుణ్ ధావన్‌తో ముంబయ్‌లో సందడి చేసింది. దాంతో వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. ఇక తాజాగా సామ్ బాలీవుడ్ సినిమాకు సంబంధించిన రెండు విషయాలు అనధికారికంగా తెలియవచ్చాయి. మొదటిది ఈ సినిమా షూటింగ్ జులై నెలలో ప్రారంభం కాబోతుంది. షూటింగ్ కోసం ఇప్పటికే మేకర్స్ ఏర్పాట్లు షురూ చేశారట. జులై నెలలో షూటింగ్‌ను ప్రారంభించి నాలుగు లేదా అయిదు నెలల్లోనే షూటింగ్‌ను ముగించేలా ప్లాన్ చేస్తున్నారట.

ఇక రెండవ విషయం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్‌ను ముంబయ్, యూరప్‌లో నిర్వహిస్తారట. మొత్తం షూటింగ్ లో మెజార్టీ పార్ట్ యూరప్ లో ఉంటుందని అంటున్నారు. ముంబయ్‌లోని పలు ముఖ్య పాత్రాల్లో షూటింగ్ నిర్వహిస్తారట. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధ్దంగా ఉంది. మరో వైపు యశోద అనే సినిమాను చేస్తోంది. అవి మాత్రమే కాకుండా తమిళంలో ఒక సినిమాను చేసిన ఈ అమ్మడు మరో వైపు తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ఒక సినిమాను చేయబోతోంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News