Wednesday, January 22, 2025

అటువంటి మూవీస్‌తోనే బాలీవుడ్‌లోకి…

- Advertisement -
- Advertisement -

Samantha act in Family man web series

ప్రముఖ ఓటిటిలో వచ్చిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సీజన్ -2 సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ భామకు ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ క్రేజ్ తో బాలీవుడ్‌లో సమంత వరుసగా సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. ఆమె కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పటివరకు ఆమె తన బాలీవుడ్ ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు. ఓ ఫిమేల్ సెంట్రిక్ బాలీవుడ్ సినిమాలో నటించేందుకు కొంతమంది సమంతను సంప్రదించినట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. కానీ అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.

ఇక తాప్సీకి చెందిన నిర్మాణ సంస్థలో కూడా సమంత నటించే అవకాశం ఉందంటూ కథనాలు వచ్చాయి. కానీ దానిపై కూడా ఇప్పటివరకు ప్రకటన రాలేదు. తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్‌లో మెయిన్ స్ట్రీమ్ సినిమాల కోసం సమంత ఎదురుచూస్తోంది. బి-గ్రేడ్ హీరోల సరసన కాకుండా మెయిన్ హీరోల సినిమాల్లో గ్లామరస్ పాత్రలు పోషించాలని ఆమె అనుకుంటోంది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్‌లో తనకున్న ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన ఇమేజ్‌ను బాలీవుడ్‌లో పొందాలని ఆమె కోరుకుంటోందట. అందుకే ఇప్పటివరకు ఆమె ఎలాంటి సినిమాలకు సైన్ చేయలేదంటున్నారు. ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమైంది. యశోద సినిమా సెట్స్‌పై ఉంది. విజయ్‌దేవరకొండతో ఓ సినిమా చేస్తోంది. అటు వరుణ్ ధావన్‌తో కలిసి ఆమె ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. తెలుగు, -తమిళ భాషల్లో ఇదివరకే ప్రకటించిన మరో సినిమాను ఆమె ప్రారంభించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News