Monday, December 23, 2024

తుది మెరుగుల్లో ‘శాకుంతలం’

- Advertisement -
- Advertisement -

Samantha act in 'Sakunthalam' movie

స్టార్ హీరోయిన్ సమంతతో ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ పౌరాణిక చిత్రం కోసం ఆయన ఓ భారీ సెట్‌ను కూడా నిర్మించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను గుణ శేఖర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతోంది. ఈ సినిమా నిర్మాణం చివరి దశలో ఉంది. ఇక ప్రస్తుతం ఫిల్మ్‌మేకర్స్ సినిమా గ్రాఫిక్స్ వర్క్‌లో బిజీగా ఉన్నారని తెలిసింది. దీంతో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మేకర్స్ ప్రారంభించినట్టు సమాచారం. ఇక ఈ భారీ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు, గుణ టీమ్ వర్క్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులోని మరో కీలక పాత్ర అయిన దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News