Thursday, January 23, 2025

షారూక్ ఖాన్ తో నటించనున్న సమంత?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దక్షిణాది చలన చిత్రంలో టాప్ హీరోయిన్ ఎవరు అంటే మొదటిగా గుర్తుకు వచ్చే పేరు సమంత. టాలీవుడ్, కోలీవుడ్‌లో అగ్ర హీరోలతో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ప్రస్తుతం సమంత బాలీవుడ్‌పై దృష్టి పడింది. ఆమె బాలీవుడు అగ్ర హీరో షారూక్ ఖాన్‌తో నటించేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్, హీరో షారూక్‌తో కలిసి డంకీ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇదే కాంబినేషన్ మరో సినిమా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. షారూక్ ఖాన్‌తో నటించేందుకు సమంత ఎంపిక చేసినట్టు బాలీవుడ్ కోడైకూస్తుంది. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు కాలేదు. స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా యూనిట్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News