Monday, December 23, 2024

విజయ్ దేవరకొండ అభిమానులకు సమంత క్షమాపణలు

- Advertisement -
- Advertisement -

లైగర్ బాయ్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఖుషి’ గురించి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘ఖుషి ‘ మూవీ ఏమైంది సామ్ అని ట్వీట్ చేశాడు. దీనిపై సమంత స్పందిస్తూ.. ఖుషి అతి త్వరలో పున: ప్రారంభం అవుతుంది. ఆలస్యమైనందుకు సామ్ విజయ్ దేవరకొండ అభిమానులకు సారీ అంటూ ట్వీట్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమా ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. కానీ సమంతకి ఆరోగ్య సమస్య ఉండటంతో షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఖుషి సినిమాపై అప్డేట్ ఇస్తూ త్వరలో షూటింగ్ మొదలవ్వనుంది శివ నిర్వాణ ప్రకటించాడు. దీంతో సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News