Friday, December 20, 2024

సమంత త్వరలో ముంబయికి మకాం మార్చేయబోతోందా?

- Advertisement -
- Advertisement -

Samantha
హైదరాబాద్: తక్కువ కాలంలోనే నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సమంత త్వరలో బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిపోవాలనుకుంటోంది. హిందీ సినిమాలు ఎక్కువ చేయాలనుకుంటోంది. అందుకు తరచూ హైదరాబాద్ నుంచి ప్రయాణాలు పెట్టుకోకుండా అక్కడే ఓ ఇల్లు కొనుక్కోవాలనుకుంటోందని సమాచారం. ఇప్పటికే ఆమె జుహు, ఖర్, బాంద్రలో కొన్ని ఇళ్లు చూసినట్లు వినికిడి. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే హిందీ సినిమా హిట్ అయ్యాక ఆమెకు హిందీలో మంచి అవకాశాలు వస్తున్నాయట. ఇదిలావుండగా నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లాట్‌ని దాదాపు రూ. 3 కోట్లు కొనుగోలు చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ఫ్లాట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేయడానికి కూడా ముంబయిలో తిష్టవేయబోతుందట. ప్రస్తుతం సమంత యశోద, శాకుంతలం సినిమాల్లో నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News