Sunday, December 22, 2024

అతని వల్లే ఇలా మారిపోయా: సమంత

- Advertisement -
- Advertisement -

 

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత టైటిల్ రోల్‌లో నటించిన, తాజాగా విడుదలైన ‘యశోద’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. మెడికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. యశోద సినిమాలో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న యాక్షన్ సీన్స్ చేయడంలో సహకరించిన ఫిట్ నెస్ ట్రైనర్ జునైద్ షేక్ గురించి చెబుతూ సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోస్ ను షేర్ చేసింది. అందులో సమంత చేతికి సెలైన్ స్ట్రిప్ ఉన్నప్పటికీ జిమ్ లో వర్కర్స్ చేస్తోంది. జునైద్ వదలకుండా ప్రాక్టీస్, థెరపీలు చేయించాడని సామ్ థ్యాంక్స్ చెప్పింది. అతని సహకారం వల్లే ఇలా మారనని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. నిన్న విడుదలైన యశోదలో సమంత నటనకు అద్భుతమైన స్పందన వస్తోంది. చాలా మంది ప్రముఖులు, అభిమానులు సమంతకు అభినందిస్తున్నారు. మరోసారి తన చక్కటి నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News