Thursday, January 23, 2025

అసలు ఆ ఆలోచన చేయొద్దు

- Advertisement -
- Advertisement -

Samantha comments on her tattoos

టాటూస్ అంటే నేటి తరానికి ఎంతో మోజు. అదేవిధంగా పలువురు హీరోయిన్‌లు తమ శరీరంపై టాటూలు వేయించుకొని వాటిని ప్రదర్శిస్తూ జనంలో క్రేజ్ పెంచారు. ఇక ప్రేమలో పడగానే ప్రతి అమ్మాయి ప్రియుడు పేరు లేదా అతని పేరులోని మొదటి అక్షరాన్ని తమ బాడీపై టాటూగా వేయించుకుంటున్నారు. అలాంటి పని సమంత కూడా చేసింది. ఆమె శరీరంపై మాజీ భర్త నాగ చైతన్య పేరుతో కొన్ని టాటూలు ఉన్నాయి. గతంలో ఇన్ స్టాగ్రామ్‌లో వాటిని పోస్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఆమె నాగ చైతన్య నుంచి విడిపోయింది. కానీ ఆ పచ్చబొట్టు చెరిగిపోదు కదా. వాటిని తొలగించాలంటే చాలా బాధాకరమైన వ్యయప్రయాస. ఇప్పుడు ఆమెకి జ్ఞానోదయమైంది. అందుకే యూత్‌కి నేను ఇచ్చే సందేశం ఇదే అంటూ ఆమె తాజాగా ఒక మాట చెప్పింది. “ఎప్పుడూ టాటూ వేయించుకోవద్దు. అసలు ఆ ఆలోచన చేయొద్దు. ఇదే నేను కుర్రకారుకి చెప్పే మాట” అని సమంత చెప్పడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News