Monday, December 23, 2024

బాలీవుడ్‌పైనే దృష్టి

- Advertisement -
- Advertisement -

Samantha to Play Villain Role in Vijay Thalapathy Next Movie

బాలీవుడ్ కెరీర్‌పై దృష్టిపెట్టిన సమంత ప్రస్తుతం ముంబయ్‌లో ఉంటోంది. ఒక్కొక్కటిగా హిందీ ప్రాజెక్ట్‌లను ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది. తెలుగు ఆఫర్లని సున్నితంగా తిరస్కరిస్తూ.. బాలీవుడ్‌లో బిజీ అవుతుంది. అయితే ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివిటీస్‌ని తగ్గించేసింది. సెలబ్రిటీలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. వాళ్ల సినిమాలు రిలీజ్ అవుతుంటే? వాళ్లికి విషెస్ చెప్పడం మినహా తన విషయాలన్నీ మాత్రం గోప్యంగానే ఉంచుతోంది. ప్రస్తుతం సమంత… వరుణ్‌ధావన్ సరసన వెబ్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా వర్క్ షాప్స్ పూర్తిచేయాల్సి ఉంది. ఇందులోనూ సామ్ డీ గ్లామర్ పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ‘ఫ్యామిలీ మ్యాన్ -2’లో చెలరేగిన సమంత ఇదే సీరిస్‌లో మరింత హాట్ పర్పార్మెన్స్‌కి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా వర్క్ షాప్స్ పూర్తిచేసే పనిలో ఉందట. అలాగే హిందీ భాషపై పట్టు కోసం హిందీ క్లాస్‌లకు రెగ్యులర్‌గా హాజరవుతోందట. ఎలాగైనా బాలీవుడ్‌లో పాగా వేయాలని సమంత తహతహలాడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News