Monday, December 23, 2024

సమంత సరికొత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

Samantha create record in OO ANTAVA OO OO ANTAVA

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప ది రైజ్’. స్టార్ డైరెక్టర్ సుకుమార్, – బన్నీల కలయికలో వచ్చిన మూడవ చిత్రమిది. ఈ మూవీ గత ఏడాది డిసెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద వరల్డ్‌వైడ్‌గా సంచలనాలు సృష్టించింది. బన్నీ కెరీర్‌లోనే రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఉత్తరాదిలో వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ మూవీ కోసం స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఐటమ్ సాంగ్ మరింతగా పాపులర్ అయింది. ‘ఊ అంటావా మావ.. ఊహూ అంటావా.. ’ అంటూ సాగే ఈ పాటలో సామ్ హుషారైన స్టెప్పులతో ఆకట్టుకుంది. ‘పుష్ప’ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ పాట నెట్టింట మరో సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది.

ఇప్పటికే పలు రికార్డుల్ని సొంతం చేసుకున్న ఈ సాంగ్ తాజాగా మరో మైలు రాయిని అధిగమించి రికార్డు సృష్టించింది. యూట్యూబ్‌లో ఈ పాట 200 మిలియన్ వ్యూస్‌ని అధిగమించడం విశేషం. తాజా రికార్డుని బట్టి ఈ పాటకు ఏ స్థాయి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే చిత్రంలోని శ్రీవల్లి సాంగ్ 100 మిలియన్ వ్యూస్ రికార్డుని సాధించింది. మిగతా పాటలు కూడా భారీ స్థాయిలో వ్యూస్‌ని రాబట్టాయి. అయితే సమంత మేనియా కారణంగా ‘ఊ అంటావా మావ ఊహూ అంటావా..’ భారీ క్రేజ్‌ని సొంతం చేసుకుని నెట్టింట రికార్డులు సృష్టిస్తుండటం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News