క్వినోవా, చియాను భారతదేశానికి తీసుకువచ్చిన తొలిబ్రాండ్ కావడంతో పాటుగా దేశీయంగా అభివృద్ధి చెందిన సూపర్‌ఫుడ్ స్టార్టప్, నరిష్ యు (nourishyou) నేడు తమ కంపెనీలో సుప్రసిద్ధ నటి సమంత రుత్ ప్రభు పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది. దేశంలో క్వినోవా మరియు చియా సీడ్స్‌ను విక్రయించిన సంస్ధగా ఆ సంప్రదాయం కొనసాగిస్తూ స్ధానికంగా సేకరించిన మరియు సస్టెయినబల్ సూపర్‌ఫుడ్స్‌ను ప్రోత్సహిస్తుంది. సమంత రుత్ ప్రభు యొక్క పెట్టుబడులు నరిష్ యు యొక్క సీడ్ ఫండింగ్ రౌండ్‌లో భాగంగా వచ్చాయి. గతంలో ట్రైయంప్ గ్రూప్‌కు చెందిన వై జనార్థన రావు ; డార్విన్ బాక్స్ కో–ఫౌండర్ రోహిత్ చెన్నమనేని ; జెరోధా కో–ఫౌండర్ నిఖిల్ కామత్ ; గృహాస్ ప్రాప్‌టెక్ కో –ఫౌండర్ అభిజీత్ పాయ్ ; కిమ్స్ హాస్పిటల్స్ సీఈఓ అభినయ్ బొల్లినేని వంటి వారు దీనిలో పెట్టుబడులు పెట్టారు.
నరిష్ యులో పెట్టుబడులు గురించి సమంత్ రుత్ ప్రభు మాట్లాడుతూ ‘‘గత కొద్ది కాలంగా నరిష్ యు ఉత్పత్తులను తింటుండటం వల్ల ఆ సంస్ధలో పెట్టుబడులు సహజంగానే జరిగాయి. క్వినోవా, చియా సీడ్స్ వంటి సూపర్ ఫుడ్స్‌ను ఇండియాకు తీసుకురావడంలో వారు పోషించిన పాత్ర, స్థానికంగా వారు ఎదిగిన తీరు, తృణధాన్యాల ఆఽధారిత క్లీన్ లేబుల్ వీగన్ సూపర్‌ఫుడ్స్ కోసం వారి ప్రొడక్ట్ రోడ్‌మ్యాప్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వినియోగదారుల ఆరోగ్యంతో పాటుగా భూమ్మీద కూడా సానుకూల ప్రభావం తీసుకువచ్చేలా విలువను నరిష్ యు సృష్టించనుందని నేను నమ్ముతున్నాను. వ్యాపారం పట్ల వారి వినూత్నమైన, స్ధిరమైన విధానంలో భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు.
ఆమె పెట్టుబడులతో పాటుగా సమంత ఇప్పుడు నరిష్ యు యొక్క మొట్టమొదటి మొక్కల ఆధారిత, వీగన్ మరియు లాక్టోస్ ఫ్రీ పాల ప్రత్యామ్నాయం మిల్లెట్ మిల్క్‌ను విడుదల చేశారు. ఈ నూతన ఉత్పత్తి ద్వారా ప్రత్యామ్నాయ డెయిరీ విభాగంలో కంపెనీ ప్రవేశించింది.
‘‘నరిష్ యు కుటుంబంలోకి సమంతను ఆహ్వానిస్తున్నాము. పుర్వకాలపు ఆహారపద్ధతుల పట్ల ఆమె ఆలోచనలు మా ఆలోచనా విధానానికి అనుగుణంగా ఉన్నాయి. ఇప్పటి వరకూ మేము అభివృద్ధి చేసిన ఉత్పత్తులు, అవి సాధించిన విజయానికి ప్రతీకగా ఆమె పెట్టుబడులు నిలుస్తాయి. సమంతతో భాగస్వామ్యంతో మార్కెట్‌లో మా స్ధానం మరింతగా వృద్ధి చెందుతుందని నమ్ముతున్నాము’’ అని నరిష్ యు కో–ఫౌండర్ కృష్ణా రెడ్డి అన్నారు.
నరిష్ యు కో –ఫౌండర్ సౌమ్య రెడ్డి మాట్లాడుతూ ‘‘ నేను పుట్టినప్పటి నుంచే లాక్టోస్ ఉత్పత్తులను తట్టుకోలేని తత్త్వం నా శరీరానిది. మా అమ్మ నాకు ఆ తరహా కనుగొనడానికి తీవ్రంగా సతమతమయ్యేవారు. అదే మిల్లెట్ మిల్క్ అభివృద్ధిలో మాకు స్ఫూర్తి కలిగించింది. డెయిరీ ఫ్రీ ప్రత్యామ్నాయాల పరంగా ఉన్న అంతరాలను ఈ మిల్లెట్‌మిల్క్ పూరించనుంది’’ అని అన్నారు.
నరిష్ యు యొక్క మిల్లెట్ మిల్క్‌ను డెయిరీ మిల్క్‌కు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. ఇది గ్లూటెన్ ఫ్రీ కావడంతో పాటుగా రాగి, జొన్న, ఓట్స్, సజ్జలతో తయారుచేశారు. ఈ మిల్లెట్ మిల్క్ రెండు ఫ్లేవర్లు– ఒరిజినల్ మరియు చాక్లొట్‌లో లభ్యమవుతుంది. దీనిని టీ , కాఫీ, స్మూతీలలో కూడా వాడవచ్చు.
నరిష్ యు ఉత్పత్తులన్నీ www.nourishyou.in తో పాటుగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్ వంటి ఈ–కామర్స్ సైట్లలో కూడా లభ్యమవుతుంది.