Wednesday, January 22, 2025

సమంత ఒంటిపైన చెరిగిపోని పచ్చబొట్టు నాగచైతన్యదే!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు నాగచైతన్య, సమంత ఎందుకు విడిపోయారన్నది వారికి తప్ప ఎవరికీ సరిగా తెలియదు. ఎవరికి వారు ఏవేవో ఊహించుకున్నారు. ఆమె సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంటుంది. తన అభిమానులను ఆమె ఎన్నడూ నిరాశపరచలేదు. సమంత నిన్న కూడా సిటాడెల్ నుంచి తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అది వేరే విషయం.

ఇక్కడ మన విషయం సమంత పచ్చబొట్టు గురించి. ఆ పచ్చ బొట్టు నాగచైతన్య సంతకం. అది తన మాజీ భర్త నాగచైతన్యకు ఆమె అంకితం చేసింది కూడా. వారిద్దరి మధ్య ప్రేమ కథ కూడా చాలా కాలం నడిచింది. వారు 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ తర్వాత వారిద్దరి మధ్య ఏమైందో ఏమో… 2021 అక్టోబర్ 2న విడిపోయారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ఇప్పటికీ సమంత తన మాజీ భర్త పచ్చబొట్టును తొలగించలేదు. వారిద్దరూ విడిపోయారన్నది ఎంత నిజమో, వారి పాత జ్ఞాపకాలు వారికింకా గుర్తున్నాయన్నది అంతే నిజం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News