Monday, December 23, 2024

సమంతకు బంపర్ ఆఫర్..

- Advertisement -
- Advertisement -

Samantha likely to opposite Vijay Devarakonda

సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీతో పాటు మంచి పరిచయాలు కూడా ఉండాలి. ముఖ్యంగా హీరోలు, దర్శకులు, నిర్మాతలని ఆకర్షించగలిగే పవర్ ఉండాలి. సమంత ఇప్పుడు మళ్ళీ పెద్ద సినిమాలు అందుకోవడానికి అదే కారణం. భర్త నాగ చైతన్యతో విడిపోయాక అల్లు అర్జున్, సుకుమార్ తో ఉన్న స్నేహంతో ‘పుష్ప’ సినిమాలో అవకాశం పొందింది సమంత. ఆ సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ బాగా ప్రజాదరణ పొందింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇప్పుడు అదే సంస్థ విజయ్ దేవరకొండతో నిర్మించే సినిమాలో హీరోయిన్ గా నటించే ఆఫర్‌ని కొట్టేసింది సమంత. విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో ఒక సినిమా త్వరలోనే మొదలుకానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ వంటి బాలీవుడ్ భామలని తీసుకోవాలనుకున్నారు. కానీ ఫైనల్‌గా సమంత వద్దకు చేరుకొంది ఈ ప్రాజెక్ట్. ఆమె పరిచయాలు, ఆమె పాపులారిటీ ఇక్కడ పని చేశాయని చెప్పొచ్చు.

Samantha likely to opposite Vijay Devarakonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News