Monday, December 23, 2024

కెటిఆర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కు లైక్ కొట్టిన సమంత

- Advertisement -
- Advertisement -

Akash Puri's 'Chor Bazaar' to release on June 24th

మన తెలంగాణ/హైదరాబాద్: టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత ఇప్పుడు బాలీవుడ్‌లో సైతం దూసుకుపోతోంది. వరుస ఆఫర్లతో బాలీవుడ్ లో సెటిల్ అయ్యేందుకు యత్నిస్తోంది. మోస్ట్ పాప్యులర్ పాన్ ఇండియా హీరోయిన్ గా ఓ సర్వేలో సమంత టాప్ పొజిషన్ లో నిలిచిందంటే ఆమె రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సమంత మరోసారి హెడ్ లైన్స్ లో నిలిచింది. ఇన్స్టాగ్రామ్ లో కెటిఆర్ చేసిన ఒక పోస్ట్ కు ఆమె లైక్ కొట్టింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కెటిఆర్ ఈ పోస్ట్ చేశారు. ఇన్స్టాలో కెటిఆర్ చేసిన పోస్ట్ ఏమిటంటే… ’దేశ జనాభాలో కేవలం 2.5 శాతం జనాభా మాత్రమే ఉండే తెలంగాణ… దేశ జీడీపీలో 5 శాతాన్ని అందిస్తోంది. గతేడాది అక్టోబర్‌లో ఆర్‌బిఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ దేశ జిడిపిలో 5 శాతాన్ని కలిగి ఉందని పేర్కొన్నట్లు వివరించారు. ఈ దేశానికి కావాల్సింది డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కాదు. డబుల్ ఫలితాలను ఇచ్చే పాలన’ అని ఆయన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కు సమంత లైక్ కొట్టింది. తెలంగాణ చేనేతకు సమంత బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించిన సంగతి విదితమే.

Samantha likes KTR’s Instagram Post

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News