Sunday, January 19, 2025

ఫోన్ ట్యాపింగ్ తోనే సమంత-నాగచైతన్య విడాకులు: బూర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌తోనే సమంత-నాగచైతన్య విడాకులు తీసుకున్నారని బిజెపి ఎంపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బిజెపి నేతలు ధర్నా చేప్టటారు. ఈ సందర్భంగా భువనగిరి బిజెపి ఎంపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మాట్లాడారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేయించారని, ఓ ఫైల్ కూడా తయారు చేశారని ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వినా కొద్ధీ కొత్త కొత్త అంశాలు బయటకు వస్తున్నాయని, అందరి వేళ్లు పెద్దాయన వైపు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల నుంచి ట్యాపింగ్ వ్యవహారం మొదలైందని, మొన్న అసెంబ్లీ ఎన్నికల వరకు జరిగిందని మండిపడ్డారు. ఇప్పటికే అరెస్టు చేసిన ఎస్‌ఐబి, టాస్క్‌ఫోర్స్ అధికారులు ఇచ్చిన వాంగ్మూలంతోనే ట్యాపింగ్ ఆపరేషన్ బయటకు వచ్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో టాలీవుడ్ జంట విడాకులు తీసుకోవాల్సి పరిస్థితి వచ్చిందని బూర వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News