Sunday, December 22, 2024

ఆ బాలిక అందరికీ ఆదర్శం: సమంత

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్ సమంత బాలీవుడ్‌లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షెన్‌లో హీరో వరుణ్ ధావన్‌తో ఆమె నటించనుంది. గత సంవత్సరం శాకుంతలం, ఖుషి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకుంది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్‌లో ఇంటర్ విద్యార్థినిని ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన నిర్మలను మెచ్చుకుంది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలలో కెజిబివి విద్యార్థినికి ఎస్ నిర్మలకు బైపిసిలో 440 మార్కులకు గాను 421 మార్కులు సాధించి టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. బాల్యం వివాహం నుంచి తప్పించుకొని మళ్లీ మరి లక్ష్యాన్ని ఎంచుకుంది. ఐపిఎస్ ఆఫీసర్ కావడమే తన లక్షమని తెలిపింది. నిర్మలకు పదోతరగతిలో 537 మార్కులు వచ్చాయి. నిర్మల తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు ఉండగా ఇప్పటికే ముగ్గురు కూతుళ్లకు వివాహాలు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండడంతో చిన్న కుమార్తె నిర్మలకు చిన్నతనంలో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. బాల్యవివాహాన్ని ఎదురించి పట్టుదలతో ఇంటర్ ఎగ్జామ్స్‌లో టాపర్‌గా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News