హీరోయిన్ సమంత కొంతకాలం క్రితం తన ‘ఎక్స్’ఖాతాని తొలగించారు. అయితే సమంత మళ్లీ ఎక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటున్నారు. హీరోయిన్ పాత్రను పక్కన పెట్టిన ఆమె.. నిర్మాతగా ఇండస్ట్రీలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే బ్యానర్‌పై ఆమె సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌లో మొదట రానున్న సినిమా ‘శుభం’.
ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ని ఆమె ఎక్స్‌లో తొలి పోస్ట్‌గా పెట్టారు. ‘పెద్ద కలలతో.. మా చిన్న ప్రేమను మీకు అందిస్తున్నాం’ అంటూ సమంత ఈ పోస్ట్‌కి క్యాప్షన్ పెట్టారు. ఈ సినిమాను అందరూ ఆదరిస్తానరని, ఇది నిజంగా తనకు ఎంతో ప్రత్యేకమైందని.. ఇదో గొప్ప ప్రారంభమని సమంత పేర్కొన్నారు.
సమంత ఎక్స్‌లో రీ ఎంట్రీ ఇవ్వడంపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ సినిమాలో కనిపించారు. ఇక ఆమె తదుపరి చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమాకి కూడా సమంతనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.