హైదరాబాద్: కెటిఆర్ చేసిన ట్వీట్‌కు ప్రముఖ టాలీవుడ్ నటి సమంత ట్విట్టర్లో స్పందించింది. రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందించదగినదని పేర్కొంది. రైతు చట్టాల రద్దుపై శనివారం కెసిఆర్ బిజెపి సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల పరిహారం, రైతులపై నమోదైన కేసుల ఎత్తివేత, కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
ఇక సమంత తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు తన మెమరబుల్ మూమెంట్స్‌ను అభిమా నులతో పంచుకుంటుంది. ఇటీవల నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత ఎప్పటిలాగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వివిధ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తోంది. విడాకులు తర్వాత సమంత ఏ చిన్న ట్వీట్ చేసినా తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో సమంత చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
Samantha Reply over KTR Tweet