అందాల తార అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ’పరధా’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమెతో పాటు సంగీత క్రిష్, దర్శన రాజేంద్రన్‌లు కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరితో పాటు అనుపమ ఆన్ స్క్రీన్ యాక్షన్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర ప్రచారం ఒకటి జరుగుతోంది. స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించేందుకు ఓకే చెప్పిందట. అనుపమ పరమేశ్వరన్‌తో సమంతకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినిమా కోసం అనుపమ స్వయంగా సమంతను గెస్ట్ రోల్‌లో నటించాల్సిందిగా కోరిందని, అందుకు సామ్ ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.
అతి త్వరలోనే పరధా షూటింగ్ కోసం సమంత సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయిదు నుంచి పది నిమిషాలు మాత్రమే కనిపించే పాత్రలో సమంత నటించనుందట. పాత్ర ఎంతది అయినా సమంత ఉంది అంటే ఖచ్చితంగా పరధా సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో రూపొందుతున్న పరధా సినిమాను సౌత్‌లోని అన్ని భాషల్లోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అనుపమ పరమేశ్వరన్ కెరీర్ ఆరంభంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ’అ ఆ’ సినిమాలో సమంత హీరోయిన్. ఆ సినిమాలో సమంత, అనుపమ కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపించబోతున్నారట.