Wednesday, January 22, 2025

ఆ తప్పు మళ్లీ చేయకూడదనుకున్నా: సమంత

- Advertisement -
- Advertisement -

అందాల తార సమంత మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకొని ప్రస్తుతం కోలుకుంటూ వస్తున్నారు. దీంతో ఆమె ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు చేయకపోయినా ఆమె యాడ్స్ షూట్‌లో పాల్గొనడంతో పాటు, సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయడం, స్టేజ్ షోల్లో కనిపించడం చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలు, వీడియోలు ఎంత పాపులారిటీని సంపాదించుకున్నాయో సమంత వ్యాఖ్యలు కూడా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన సమంత ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జోరుగా వైరల్ అవుతున్నాయి. ‘మీ జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు ఏంటి’ అనే ప్రశ్నకు సమంత ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. “నేను నా ఇష్టాలను, అయిష్టాలను తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యాను.

ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం అతి పెద్ద పొరపాటు గా నేను భావిస్తున్నాను. నా జీవిత భాగస్వామి వల్ల ఎక్కువగా ప్రభావితమై నా ఇష్టాలను, నా అయిష్టాలను గుర్తించలేకపోయాను. ఒకానొక సమయంలో చాలా పెద్ద తప్పు చేశాను, ఆ తప్పు మళ్లీ చేయకూడదని భావిస్తున్నా. వ్యక్తిగత జీవితంలో ఇష్టాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వెళ్లక పోవడం అనేది జీవితంలో అతి పెద్ద తప్పుడు నిర్ణయం అవుతుంది. అదే అతి పెద్ద పొరపాటు అవుతుంది”అని సమంత పేర్కొంది. ఇక ఇటీవల ఖుషి సినిమా తో టాలీవుడ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సమంత నుంచి త్వరలోనే కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తుందేమో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News