Sunday, December 22, 2024

చెడుపై మంచి సాగించే పోరాటం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ దీపావళికి గొప్ప యాక్షన్, అడ్వెంచర్, పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడానికి మార్వెల్ స్టూడియోస్ వారు ‘ది మార్వెల్స్’ సినిమాతో ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్‌లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో భారతీయ అభిమానుల కోసం ప్రత్యేక వీడియోను విడుదల చేసి అభిమానులలో జోష్ పెంచారు. అలాగే ఈనెల 4న అన్ని ఫార్మా ట్లలో ఈ సినిమా ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సమంత స్పెషల్ గెటప్‌లో విచ్చేసి అభిమానులను అలరించారు.

ఈ దీపావళికి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడానికి మార్వెల్ ఇండియాతో జతకట్టడం పట్ల తాను ఎంతో థ్రిల్‌గా ఫీల్ అవుతున్నా నని అన్నారు సమంత. ‘ది మార్వెల్స్’ సినిమాలో ఒకరు కాదు ముగ్గురు శక్తివంతమైన సూపర్ హీరోలు ఈసారి చెడుపై మంచి సాగించే అంతిమ యుద్ధంలో పోరాడుతారని తెలిపారు. మార్వెల్ స్టూ డియోస్ ‘ది మార్వెల్స్ ‘ ఈ దీపావళికి ఈనెల 10న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో భారతీయ థియేటర్లలోకి వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News