Sunday, April 13, 2025

రెండో పెళ్లికి సమంత రెడీ…. వరుడు ఎవరంటే?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారని సినీ వర్గాలు కోడైకూస్తున్నాయి. తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి చర్చించినట్టు సమాచారం. అక్కినేని నాగ చైతన్య సమంతతో విడిపోయిన తరువాత దూళిపాళ్ల శోభితను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సమంత కూడా రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆమె గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిదిమోరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. ఇద్దరు డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. ఇద్దరు చెన్నై వీధులో తిరుగుతుండడంతో ఇద్దరు మధ్య ప్రేమాయణం నడుస్తుందని వార్తలు హల్‌చల్ చేశాయి. మే నెలలో రాజ్‌నిదిమోరు ను సమంత వివాహం చేసుకుంటుందని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News