Friday, December 27, 2024

వైరల్ వీడియో: మైనస్ 150 డిగ్రీల టబ్బులో సమంత

- Advertisement -
- Advertisement -

మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత రకరకాల వైద్య చికిత్సా పద్ధతులను అనుసరిస్తూ, ఆ మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తను క్రయోథెరపీ చేయించుకుంటున్నట్లు సమంత ఇన్ స్టా స్టోరీలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ చికిత్సలో భాగంగా తను మైనస్ 150 డిగ్రీల చల్లదనం ఉన్న ఒక టబ్బులో కూర్చున్నానని, క్రయోథెరపీ వల్ల తెల్ల రక్త కణాల సంఖ్య బాగా పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. దీనివల్ల శరీరంలో వ్యాధికారక క్రిములు తగ్గుతాయని ఆమె తెలిపారు. ఈ వీడియోను సమంత అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు.

ఇందులో సమంత తను టబ్బులో కూర్చుని చికిత్స పొందుతున్న దృశ్యాలున్నాయి. ఖుషి సినిమా షూటింగ్ పూర్తయ్యాక సమంత కొంతకాలం విరామం తీసుకున్నారు. ఈ సమయంలో హాలీడే ట్రిప్ గా ఇండొనేసియా దీవులకు వెళ్లొచ్చారు. మరికొన్ని రోజులు మయోసైటిస్ కి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ది మార్వెల్స్ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News