Monday, January 20, 2025

నవంబర్ నుంచి ‘ఖుషీ’ చిత్రీకరణలో..

- Advertisement -
- Advertisement -

Samantha received a rare feat on Instagram

సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేని షెడ్యూళ్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు తెలుగు సినిమాలు మరోవైపు హిందీ సినిమాలతో భారీ షెడ్యూళ్లను కలిగి ఉంది. అయితే ఇంతలోనే కొన్ని వారాల పాటు అమెరికా ట్రిప్ వెళ్లి సర్‌ప్రైజ్ చేసింది. ఆమె అమెరికా నుంచి తిరిగి రాగానే అటు రాజ్ అండ్ డీకేతో ప్రాజెక్ట్‌ని పూర్తి చేయడంతో పాటు ఇతర తెలుగు పెండింగ్ ప్రాజెక్టులను త్వరత్వరగా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ-, శివ నిర్వాణ కాంబినేషన్ మూవీ ఖుషీ కోసం సమంత కాల్షీట్లు కేటాయించిందని తెలిసింది. సామ్ కోసం నెలల తరబడి ఖుషీ చిత్రబృందం వేచి చూసింది. నవంబర్ నుంచి బల్క్ డేట్లు కేటాయించడంతో దర్శకుడు శివ నిర్వాణ రెట్టించిన ఉత్సాహంతో పని చేయనున్నారు. నవంబర్ నుంచి సినిమా టాకీ మెజారిటీ పార్ట్ హైదరాబాద్‌లో పూర్తవుతుంది. ‘ఖుషీ’ చక్కని రొమాంటిక్ ఎంటర్‌టైనర్. కామెడీ, కుటుంబ డ్రామా, శృంగారం మిళితమైన అందమైన సినిమా అని చిత్రబృందం చెబుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News