Thursday, September 19, 2024

అబ్బబా….అవన్నీ వదంతులే: సమంత

- Advertisement -
- Advertisement -

Samantha Ruth Prabhu
హైదరాబాద్: “నా వ్యక్తిగత జీవితంపై అబ్బబా…ఎన్నెని వదంతులు? అవన్నీ నిరాధారాలే” అని నటి సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పేర్కొంది. “నాకు వేరే వాళ్లతో సంబంధాలున్నాయని(అఫైర్స్), నేను పిల్లలు వద్దనుకున్నానని, అబార్షన్లు చేయించుకున్నానని, నేనే అవకాశవాదినని…ఎన్నెన్ని వదంతులు వ్యాపింపజేశారు. అవన్నీ అసత్య ప్రచారాలే” అని ఆమె ఖండించింది.
“నాపై మీరు చూపిస్తున్న సానుభూతికి కృతజ్ఞతలు. అయితే కొందరు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వదంతులు వ్యాపింపజేస్తున్నారు. విడాకులు తీసుకోవడం చాలా బాధతో కూడుకున్నది. నన్ను నాపాటుకు వదిలేయండి. వ్యక్తిగతంగా నాపై దాడిచేయడం దారుణం. మీరు అనుకున్న విధంగా నేను ఎన్నడూ చేయను. మీరు నన్ను ఎంత బాధపెట్టినా చెదరను” అని ట్విటర్ లో పోస్ట్ చేసింది.

Image

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News