Monday, January 20, 2025

విజయ్ దేవరకొండ అభిమానులకు సమంత క్షమాపణ..

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ సమంత క్షమాపణ చెప్పింది. ఆమె కారణంగానే ‘ఖుషి’ సినిమా షూటింగ్ ఆరు నెలలుగా ఆగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. అయితే ‘ఖుషి’ షూటింగ్ మొదలు పెట్టకుండా ‘సిటాడెల్’ అనే హిందీ వెబ్ సిరీస్ ప్రాంభించింది. మరి ‘ఖుషి’ సంగతి ఏంటి? అని ఒక విజయ్ దేవరకొండ అభిమాని ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చింది. “విజయ్ దేవరకొండ అభిమానులు అందరికీ నా తరఫున క్షమాపణలు చెబుతున్నాను.

ఖుషి త్వరలోనే మొదలవుతుంది”అని పేర్కొంది. ఆమె సమాధానం చూసి హీరో విజయ్ దేవరకొండ వెంటనే స్పందించాడు. పూర్తిగా కోలుకొని, హాయిగా నవ్వుతూ సెట్ మీదికి రావాలని కొరుకుంటున్నామని విజయ్ చెప్పాడు. ఇక విజయ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ గత ఏడాది పట్టాలెక్కింది. ఫీల్‌గుడ్ ప్రేమ కథా చిత్రంగా కాశ్మీర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News