Wednesday, January 8, 2025

జీవితానికి ఏది ముఖ్యమో తెలుసుకున్నా

- Advertisement -
- Advertisement -

ఏ స్త్రీ అయినా జీవితంలో మాతృత్వాన్ని చూడాలనుకుంటుంది. అదొక అందమైన అనుభూతి. ఈ కోరిక సమంతకు కూడా ఉంది. మాతృత్వాన్ని ఆస్వాదించాలనే కోరికను సమంత బయటపెట్టింది. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తల్లి కావాలనే కోరిక ఆమెకు బలంగా ఉండేదట. కానీ నాగచైతన్యతో వైవాహిక బంధంలో ఉన్నప్పుడు మాత్రం సమంత గర్భం దాల్చలేదు. ఇప్పుడామె సింగిల్‌గా ఉంది. అయితే మాతృత్వాన్ని ఆనందించడానికి వయసుతో సంబంధం లేదంటోంది సమంత. అంటే భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో మరో పెళ్లి చేసుకొని, అప్పుడు బిడ్డకు జన్మనిస్తాననే అర్థం వచ్చేలా మాట్లాడింది. ప్రస్తుతం జీవితంలో పాజిటివ్ దశలో ఉన్నానని, తన జీవితానికి ఏది ముఖ్యమో తెలుసుకున్నానని అంటోన్న సమంత ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News