Thursday, January 23, 2025

నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మీకందరికీ థాంక్స్ : సమంత

- Advertisement -
- Advertisement -

Samantha

హైదరాబాద్: ఏప్రిల్‌28న సమంత నటించిన ‘కాతు వక్కుల రెండు కాదల్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదేరోజు సమంత పుట్టినరోజు కావడం మరింత విశేషంగా మారింది. గురువారం సామ్‌ 35వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అభిమానులు సహా పలువురు ప్రముఖులు ఆమెకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ సమంత పోస్ట్‌ చేసింది. ‘‘నా పుట్టినరోజు నాడు ప్రేమతో శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ అందరి  ప్రోత్సహం, స్ఫూర్తి, సానుకూలతలకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొనేందుకు మీరంతా నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపారు’’ అంటూ సామ్‌ భావోద్వేగ పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News