Monday, December 23, 2024

మహేష్‌బాబుకు జోడీగా సమంత…

- Advertisement -
- Advertisement -

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సమంతలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దూకుడు లాంటి విజయవంతమైన చిత్రాలొచ్చాయి. అయితే వీరిద్దరూ మళ్లీ కలిసి నటించబోతున్నారని తెలిసింది. మహేష్‌బాబు, త్రివిక్రమ్ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా పూజా హెగ్డేని ఎంచుకున్నారు. అయితే ఆమె స్థానంలో ఇప్పుడు సమంత వచ్చి చేరినట్టు తెలిసింది. పూజా కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో ఈ మార్పు చేయాల్సి వచ్చిందని సమాచారం. త్రివిక్రమ్, సమంతలది కూడా విజయవంతమైన కాంబినేషనే. వీరి కాంబినేషన్‌లో అత్తారింటికి దారేది, సన్నాఫ్ కృష్ణమూర్తి, అ..ఆ వంటి హిట్ చిత్రాలొచ్చాయి. ఇక ఈ చిత్రం త్వరలో లాంఛనంగా ప్రారంభమవుతుందని తెలిసింది. ఇదో ఫ్యామిలీ డ్రామా అని, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలున్నాయిని సమాచారం.

Samantha to Pair with Mahesh Babu’s new project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News