Thursday, January 23, 2025

ప్రేతాత్మగా సమంత!

- Advertisement -
- Advertisement -

సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు బాలీవుడ్‌లో అమాంతం డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. అక్కడ వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. యువహీరో వరుణ్ ధావన్ తో వెబ్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. ఇది రస్సో బ్రదర్స్ ‘సిటాడెల్’కి భారతీయ వర్షన్. ఈ సిరీస్ కోసం మార్షల్ ఆర్ట్ లో సమంత శిక్షణ పొందుతోంది. అయితే, అదే సమయంలో తన తొలి హిందీ సినిమా షూటింగ్ కూడా ఆమె ప్రారంభించిందని సమాచారం. ‘స్త్రీ’ ఫేమ్ అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న హారర్ చిత్రం కోసం హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి వర్క్ షాప్‌లో పాల్గొంటోంది సమంత. రాజస్థాన్ నేపథ్యంలో జానపద కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని… సామ్ ఈ మూవీలో రాజ్ పుత్ యువరాణిగా, అలాగే ప్రేతాత్మ(దెయ్యం)గా నటిస్తుందని తెలిసింది. ఆయుష్మాన్ ఆమె ప్రేమికుడిగా కనిపిస్తారని సమాచారం.

Samantha to Star in Horror Hindi film

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News