Saturday, September 21, 2024

సమంత పెద్ద స్టార్: మనోజ్ బాజ్‌పాయీ

- Advertisement -
- Advertisement -

Samantha and Bajpai
న్యూఢిల్లీ: హిందీ సినీ నటుడు మనోజ్ బాజ్‌పాయీ ‘ద ఫామిలీ మ్యాన్ 2’లో తనతోపాటు నటించిన సమంత రుత్ ప్రభును తెగ పొగిడాడు. ఆమెను ‘సూపర్‌లేటివ్ ఇన్ ద సీరీస్’ అని కూడా అభివర్ణించాడు. సినిమాలో అద్భుతంగా నటించిందన్నాడు.  అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా రిలీజ్ అయింది. సినిమాలో సమంత పాత్ర, నటన చాలా గొప్పగా ఉందని తెలిపాడు. దీనికి ముందు సమంత కూడా ‘ద ఫామిలీ మ్యాన్ 2’ సినిమా గురించి మాట్లాడింది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫ్ఫీ)లో ప్యానెల్ డిస్కషన్‌లో మాట్లాడుతూ “ ఓ నటిగా, నేనెప్పుడు ఎల్లలు దాటి భావోద్రేకాలను పండించాలనుకుంటాను. మహిళా నటీమణులకు మంచి పాత్రలు లభించడమే అరుదు. అందునా తమ నటనా పాటవాన్ని ప్రదర్శించుకునే అవకాశం కూడా తక్కువే ఉంటుంది. పాత్ర పోషణ పాత చింతకాయ పచ్చడిలానే ఉందనిపిస్తుంటుంది. అయితే ఈ సినిమాలో రాజీ పాత్రతో నేను నన్ను భిన్నంగా ఆవిష్కరించుకునే అవకాశం లభించింది. కొత్త కోణాన్ని చూపేట్టే ఛాన్స్ లభించింది” అని తెలిపింది. సమంత పోషించిన ఆ ‘రాజీ’ పాత్ర శ్రీలంకలో పోరాడిన తమిళ విమోచన యోధురాలి పాత్ర.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News