Wednesday, January 22, 2025

నటి సమంత కెరీర్ ఇక ఖతమన్న చిట్టి బాబు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ రంగంలో తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకోవడమన్నది ఎవరికైనా కష్టమే. అందునా ఎవరి అండదండలు లేకుండా రాణించడమన్నది మరీ కష్టం. ఇలాంటి స్థితిలో కూడా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్న నటి సమంత. నేడామెకు ఓ స్టార్ ఇమేజ్ కూడా ఉంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంటూ ఒక్కో మెట్టే పైకెక్కిన సమంతను అంతగా ఎవరికీ తెలియని చిట్టి బాబు అనే ప్రొడ్యూసర్ నోటికొచ్చినదంతా అనేశారు. ఆమెకు ఇకపై స్టార్‌డమ్ ఉండదనేశాడు. ఆమె సానుభూతి డ్రామాలతో తన సినిమాలు విజయవంతం చేసుకోలేదన్నారు. సమంత తాజా చిత్రం ‘శాకుంతలం’ పై తనకు ఆసక్తి కూడా లేదన్నారు.

‘తన జీవనోపాధి కోసమే ఆమె పుష్ప సినిమాలో ఊ అంటావా…పాటలో నటించింది. ఆమెకు స్టార్ హిరోయిన్ స్టేటస్ పోవడం వల్లే అలా చేసింది. ఏ పాత్ర దొరికినా చేయడానికి ఆమె రెడీ. హిరోయిన్‌గా ఆమె కెరీర్ ముగిసిపోయింది. ఆమె మళ్లీ స్టార్ స్థాయికి రాలేదు. ఏ పాత్ర దొరికితే అది చేసుకుంటూ జీవనం సాగించాల్సిందే’ అని ఆయన చెప్పారు.

‘యశోద సినిమా ప్రమోషన్ అప్పుడు ఆమె కన్నీళ్ళు పెట్టుకుని హిట్ సాధించింది. ఇప్పుడు శాకుంతలంలో కూడా అదే ట్రిక్ ప్లే చేయాలని చూసింది. అందరి నుంచి సానుభూతి పొందాలని చూసింది. చనిపోయేలోగా ఆ పాత్ర చేయాలనుకున్నానని చెప్పింది. తన గొంతు నుంచి మాట కూడా బయటికి రాలేదని చెప్పింది. ప్రతిసారి సెంటిమెంట్ వర్కవుట్ కాదు. సినిమా, పాత్ర బాగుంటే అందరూ చూస్తారు. నా వరకైతే నాకు శాకుంతలం సినిమాలో ఆసక్తి లేదు’ అన్నారు చిట్టిబాబు.

చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వివాదంగా(కాంట్రవర్సీ) మారింది. చాలా మంది సమంతకు అండగా ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. సమంత తన టాలెంట్, హార్డ్ వర్క్ కారణంగానే సినీ రంగంలో ఎదిగింది. ఏ మాయ చేశావే, ఈగ, రంగస్థలం వంటి సినిమాల్లో మెప్పించి అవార్డులు కూడా గెలుచుకుంది. వాస్తవానికి సమంత చాలా ధైర్యస్థురాలు, ఒంటరిగానే ఎన్నో సమస్యలు నెగ్గుకొచ్చే స్థయిర్యం ఆమెకుంది. సినీ రంగంలో ఆమె అనేక మంది యువతులకు ప్రేరణ కూడా. సమంత, చిట్టిబాబు వివాదాస్పద వ్యాఖ్యలను, విమర్శకుల నోళ్లను కూడా మూయించేలా మళ్లీ ఎదుగుతుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఆమె తాజా చిత్రం ‘శాకుంతలం’ అయితే అంతగా రాణించలేదనే చెప్పాలి.

actress Samantha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News