Wednesday, January 22, 2025

‘శాకుంతలం’ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ ‘ఋషి వ‌నంలోన‌’

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’. ఫిబ్ర‌వ‌రి 17న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. ప్ర‌తి ఫ్రేమ్‌ను అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించే గుణ శేఖ‌ర్ మ‌రోసారి ‘శాకుంతలం’ వంటి విజువ‌ల్ వండ‌ర్‌తో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అందులో భాగంగా విడుద‌లైన మూవీ ట్రైల‌ర్, ‘మల్లికా మల్లికా..’ సాంగ్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేశాయి.

ఈ నేప‌థ్యంలో బుధ‌వారం చిత్ర యూనిట్ ‘శాకుంతలం’ సినిమా నుంచి ‘ఋషి వ‌నంలోన‌…’ పాటను విడుద‌ల చేశారు. మెలోడి బ్ర‌హ్మ‌గా పేరున్న మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందించటంతో మ‌రోసారి ఆయ‌న త‌న‌దైన శైలిలో అంద‌మై బాణీల‌ను ప‌లికించారు. దుష్యంతుడు, శ‌కుంత‌ల మ‌ధ్య ఉండే ప్రేమ‌ను తెలియ‌జేసే ఈ పాట అంద‌రి హృద‌యాల‌ను ఆక‌ట్టుకుంటోంది.

ఈ పాట‌లో క‌నిపించే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ విజువ‌ల్స్ ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపింప చేస్తుంది. ఈ ఇన్‌టెన్స్ క్యాచీ సాంగ్‌ను సిద్ శ్రీరామ్‌, చిన్మయి ఎంతో శ్రావ్యంగా ఆల‌పించారు. శ్రీమ‌ణి పాట‌ను రాశారు. దేవ్ మోహ‌న్‌, స‌మంత మ‌ధ్య ఉండే కెమిస్ట్రీ ఓ మ్యాజిక్‌ను క్రియేట్ చేసింది. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News