- Advertisement -
హీరోయిన్ సమంత నిర్మిస్తున్న తొలి మూవీ ‘శుభం’. అంత కొత్తవారితో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇందులో మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు సమంత. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో సామ్ కూడా కీ రోల్ లో నటించారు. కామెడీ, హర్రర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా మే 9న విడుదల కానుంది.
- Advertisement -