Monday, December 23, 2024

ఇంద్రవెల్లిలో సమరభేరి

- Advertisement -
- Advertisement -

నేడు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సిఎం రేవంత్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్:  ఇంద్రవెల్లిలో శుక్రవారం జరిగే తెలంగాణ పునర్నిర్మాణ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేదిక నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోగించనున్నారు. రే వంత్ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఇంద్రవెల్లిలో భా రీ సభ నిర్వహించారు. అప్పటి నుంచి తాను ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతా న్ని ఆయన సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. అందులో  భాగంగానే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆయన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఈ వేది క నుంచి సిఎం రేవంత్ పిలుపు ఇవ్వనున్నారు. అందులో భాగంగా ఇంద్రవెల్లిలో దాదాపు లక్ష మం దితో భారీ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు సైతం ఈ సభకు హాజరుకానున్నారు. సిఎం అయిన తర్వాత తొలి సభను ఇక్కడే నిర్వహించబోతుండడంతో ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లను మంత్రి సీతక్క దగ్గరుండి పరిశీలిస్తున్నారు.
ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళులు
నేడు మధ్యాహ్నం 1:45 గంటలకు సిఎం రేవంత్ కేస్లాపూర్ చేరుకోనున్నారు. నాగోబా ఆలయ దర్శనం అనంతరం పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లికి చేరుకుంటారు. ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళు లు అర్పించిన అనంతరం పలు అభివృద్ధి పనులకు సిఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే భారీ సభలో సిఎం ప్రసంగించనున్నారు. కాగా ముఖ్యమంత్రి తొలి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో రెండు గ్యారెంటీల అమలుపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. దీంతోపాటు ఇంద్రవెల్లి అమర వీరుల స్మృతి వననానికి సిఎం భూమి పూజ చేయనున్నారు. అమరవీరుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని గతంలో సిఎం హామీ ఇచ్చారు. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని స్థానికులు విజ్ఞప్తి చేయడంతో ఇక్కడి అభివృద్ధిపై కూడా సిఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాకు వరాలు ప్రకటించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News