Monday, December 23, 2024

అఖిలేశ్ పాక్ వ్యాఖ్యలపై బిజెపి ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

Sambita patra comments on Akhilesh yadav

లక్నో : భారత్‌కు పాకిస్థాన్ “ రాజకీయ శత్రువు ” మాత్రమేనంటూ సమాజ్‌వాది పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఓ ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యలపై బిజెపి సోమవారం నాడు మండిపడింది. అఖిలేశ్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని బిజెపి ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ( జనవరి 24) దేశం జరుపుకొంటున్న తరుణంలో భారత్‌కు పాక్ నిజమైన శత్రువు కాదని అఖిలేశ్ పేర్కొనడం ఏమిటని ప్రశ్నించారు. యూపి ఎన్నికల్లో క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్న నేరగాళ్లకు సమాజ్‌వాది టికెట్లు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. దీనికి ముందు అఖిలేశ్ ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ మన నిజమైన శత్రువు చైనా అని, పాకిస్థాన్ మన రాజకీయ శత్రువు మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బిజెపి పాకిస్థాన్‌ను లక్షంగా చేసుకుంటోందని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News